ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. ఎక్కడ? ఎప్పుడు?
- జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో ‘దృశ్యం 3’
- తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
- ప్రపంచవ్యాప్తంగా రూ.234 కోట్లకు పైగా వసూళ్లు
- మోహన్‌లాల్ కెరీర్లో భారీ విజయం
- కుటుంబం కోసం జార్జ్‌కుట్టి పోరాటమే కథలో హైలైట్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. మే 21న విడుదలైన ఈ చిత్రం నెల రోజులు పూర్తికాకముందే డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘దృశ్యం 3’ డిజిటల్ హక్కులను నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ నుంచి ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాల్లో ఒకేసారి స్ట్రీమ్ చేయనున్నారు.
దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి కథను కొత్త కోణంలో ఆవిష్కరించారు. గత రెండు భాగాల మాదిరిగా వరుస ట్విస్టులపై కాకుండా జార్జ్‌కుట్టి పాత్ర ఎదుర్కొనే నైతిక సంఘర్షణలు, కుటుంబాన్ని కాపాడేందుకు అతడు ఎంతదూరమైనా వెళ్లే పరిస్థితులను ప్రధానంగా చూపించారు.
బాక్సాఫీస్ వద్ద కూడా ‘దృశ్యం 3’ భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.234.97 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం విదేశాల్లోనే రూ.111.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. భారత్‌లో రూ.123 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మోహన్‌లాల్‌తో పాటు మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా హసన్, సిద్ధిఖ్, ఆశా శరత్, మురళీ గోపీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.